అక్షరటుడే, వెబ్‌డెస్క్: kaleshwaram | కాళేశ్వరం విచారణ కమిషన్ (Kaleshwaram inquiry mommission) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుందనే ప్రచారం జరుగుతున్న వేళ రెండు నెలల పాటు గడువు పొడిగించడం ఆసక్తికంగా మారింది. కాగా.. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ సాగుతోంది.
kaleshwaram | పొడిగింపు అందుకేనా..!
పీసీ ఘోష్ కమిషన్ (PC ghosh commission) పదవీ కాలం పెంపుతో మళ్లీ విచారణ ఇంకా కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌ను విచారించడం కోసం కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారనే చర్చ సాగుతోంది.