Eatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​పై బీజేపీ నేత, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ఓ అద్భుతమైన వరమని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి. ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో ఎండాకాలంలో తెలంగాణ(Telangana)లో చెరువులు మత్తడి దూకాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో వాగులు పారాయని, చెరువులు నిండాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో పాటు చెక్​డ్యాములు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​పై బీజేపీ నేత, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ఓ అద్భుతమైన వరమని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి.

ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో ఎండాకాలంలో తెలంగాణ(Telangana)లో చెరువులు మత్తడి దూకాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో వాగులు పారాయని, చెరువులు నిండాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో పాటు చెక్​డ్యాములు కట్టడంతో నేడు తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్​తో ఎస్సారెస్పీ ఆయకట్టు 14.8 లక్షల ఎకరాలకు నీరు అందిందని పేర్కొన్నారు. ఎండాకాలంలో కూడా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో కూడా నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయంటే కాళేశ్వరమే కారణం అన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతలతో వచ్చే కరెంట్​ బిల్లు సంగతి పక్కన పెడితే.. ఈ ప్రాజెక్ట్​తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్​ వచ్చాక రైతులు (Farmers) మళ్లీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వివాదం చేయకుండా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో నచ్చిన వారికి కాంట్రాక్ట్​లు ఇచ్చారో లేదో తనకు తెలియదన్నారు.

Eatala Rajendar | రాజకీయ వర్గాల్లో చర్చ

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై ఈటల రాజేందర్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్​ఎస్(BRS)​ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్​ఎస్​ ఆయనను పక్కన పెట్టింది. మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుంచి కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన తాజాగా కాళేశ్వరం అద్భుతమని పొగడటం గమనార్హం.

బీజేపీ నాయకులు కాళేశ్వరంతో ఉపయోగం లేదని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్​ ఆ ప్రాజెక్ట్​తో రైతులకు మేలు అని వ్యాఖ్యానించడం గమనార్హం. మేడిగడ్డ(Medigadda) కుంగుబాటు, కాళేశ్వరంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ కాళేశ్వరం కమిషన్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ ఎదుట జూన్​ 5న ఈటల రాజేందర్​ విచారణకు హాజరయ్యారు. మంత్రివర్గంలో చర్చించాకే పనులు చేపట్టామని ఆయన కమిషన్​కు వివరించారు. బ్యారేజి నిర్మాణం మేడిగడ్డకు మార్చడంపై స్పందిస్తూ.. సాంకేతిక అంశాలు తమకు తెలియదని, అధికారుల సూచన మేరకు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్​తో తెలంగాణకు ఎంతో మేలు అని వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...