Kaleshwaram 22nd package : కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్లు మంజూరు మంజూరు
Kaleshwaram 22nd package : కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్లు మంజూరు మంజూరు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kaleshwaram 22nd package : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో Yellareddy constituency లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు రూ 23 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ mla madan Mohan Rao తెలిపారు. గత ప్రభుత్వ పాలకుల అసమర్ధత వలన మూడు సంవత్సరాలుగా ఎటువంటి నిధులు లేక పనులు నిలిచిపోయయన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ, ఎల్లారెడ్డి ప్రజల తరపున కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు తిరిగి ప్రారంభించాలని కోరారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, చీఫ్ ఇంజనీర్ (ENC) గారితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ప్రభుత్వం రూ.23 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో యాచారం పంప్ హౌస్, చందాపూర్, తాడ్వాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్, దేవైపల్లి లెఫ్ట్ మెయిన్ కాలువ, సోమారం లెఫ్ట్ మెయిన్ కాలువ, బ్రహ్మాజివాడి లెఫ్ట్ మెయిన్ కాలువ, మార్క్ల భూంపల్లి, లింగంపల్లి, ధర్మారావుపేట గ్రామాలలో కాలువల కోసం సేకరించిన భూములకు పరిహారం అందనుంది.