Kaleshwaram Works : కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్లు మంజూరు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kaleshwaram 22nd package : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో Yellareddy constituency లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు రూ 23 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ mla madan Mohan Rao తెలిపారు. గత ప్రభుత్వ పాలకుల అసమర్ధత వలన మూడు సంవత్సరాలుగా ఎటువంటి నిధులు లేక పనులు నిలిచిపోయయన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ, ఎల్లారెడ్డి ప్రజల తరపున కాళేశ్వరం 22వ ప్యాకేజీ […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kaleshwaram 22nd package : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో Yellareddy constituency లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు రూ 23 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ mla madan Mohan Rao తెలిపారు. గత ప్రభుత్వ పాలకుల అసమర్ధత వలన మూడు సంవత్సరాలుగా ఎటువంటి నిధులు లేక పనులు నిలిచిపోయయన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ, ఎల్లారెడ్డి ప్రజల తరపున కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు తిరిగి ప్రారంభించాలని కోరారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, చీఫ్ ఇంజనీర్ (ENC) గారితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ప్రభుత్వం రూ.23 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో యాచారం పంప్ హౌస్, చందాపూర్, తాడ్వాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్, దేవైపల్లి లెఫ్ట్ మెయిన్ కాలువ, సోమారం లెఫ్ట్ మెయిన్ కాలువ, బ్రహ్మాజివాడి లెఫ్ట్ మెయిన్ కాలువ, మార్క్ల భూంపల్లి, లింగంపల్లి, ధర్మారావుపేట గ్రామాలలో కాలువల కోసం సేకరించిన భూములకు పరిహారం అందనుంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...