Jurala Project | ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్​.. పరిశీలించనున్న మంత్రి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా(Gadwal District)లో గల జూరాల ప్రాజెక్ట్​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. కొన్ని రోజులుగా జలాశయానికి వరద కొనసాగుతుండడంతో.. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న నీటిని వదర గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా(Gadwal District)లో గల జూరాల ప్రాజెక్ట్​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. కొన్ని రోజులుగా జలాశయానికి వరద కొనసాగుతుండడంతో.. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న నీటిని వదర గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. అయితే గేట్లు ఎత్తే సమయంలో పలు రోప్​లు తెగిపోవడంతో ప్రాజెక్ట్ భద్రతపై ఆందోళన నెలకొంది.

Jurala Project | తెగిపోయిన రోప్​లు

జూరాల ప్రాజెక్ట్(Jurala Project ) గేట్లు ఎత్తడంతో గురువారం తొమ్మిదో నంబర్​గేటు రోప్​ తెగిపోయింది. మరోవైపు తాజాగా 31 నెంబర్‌ గేట్‌ ఐరన్‌ రోప్‌లు(Iron ropes) తెగిపోయాయి. 8వ గేటుకు సైతం రెండు రోప్​లు తెగిపోయాయి. 4వ గేటుకు రెండువైపులా ఒక్కో ఐరన్ రోప్‌ తెగిపోయింది. మరో ఐదు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఆయా గేట్లను ఎత్తడం వీలయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్ట్​ భద్రతపై దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, ఆయకట్టు రైతులు(Formers) ఆందోళన చెందుతున్నారు.

Jurala Project | పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్​

జూరాల ప్రాజెక్ట్​ వరద గేట్ల రోప్​లు తెగిపోవడంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి(Minister Uttam Kumar Reddy) శనివారం పరిశీలించనున్నారు. నేడు ఆయన ప్రాజెక్ట్​ను సందర్శించి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా జూరాల ప్రాజెక్ట్​కు ఇటీవల వేసవిలో మరమ్మతులు చేపట్టారు. అయినా గేట్ల రోప్​లు తెగిపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jurala Project | జూరాల ఎంతో కీలకం

కృష్ణానదిపై తెలంగాణ(Telangana)లో ఉన్న తొలి ప్రాజెక్ట్​ జూరాల. దీనిని గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం దగ్గర నిర్మించారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ప్రాజెక్ట్​ నిర్మాణం ప్రారంభించగా.. 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దశ నీటిని విడుదల చేసి ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. 9.8 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్​కు 62 గేట్లు ఉన్నాయి.
ప్రాజెక్టు కుడి కాల్వను సోమనాద్రి కాలువగా పిలుస్తారు.

ఈ కాలువ ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాల్వగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా  ఆత్మకూరు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అంతేగాకుండా ఈ ప్రాజెక్ట్​ దగ్గర విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా కూడా జలాశయం మారింది. ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్​ గేట్లను అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...