Homeతాజావార్తలుJubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​ షురూ..!

Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​ షురూ..!

Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్​ మొదలైంది. హైదరాబాద్​ యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్​ మొదలైంది. హైదరాబాద్​ యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

మొత్తం 10 రౌండ్స్‌లో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇందుకోసం 42 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. అంటే మధ్యాహ్నం లోపు గెలుపు ఎవరిదో తేలిపోనుంది. తాజాగా బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు మొదలెట్టారు.

Jubilee Hills by-election results | ఒక్క ఏజెంట్​కే అనుమతి..

కౌంటింగ్ కేంద్రంలోకి ఒక్క ఏజెంట్​ను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, భారాస అభ్యర్తి మాగంటి సునీత తన వెంట ఇద్దరు ఏజెంట్లను అనుమతించాలని కోరారు. కానీ, ఆమె అభ్యర్థనను కౌంటింగ్​ సిబ్బంది, పోలీసులు తిరస్కరించారు.

Jubilee Hills by-election results | 144 సెక్షన్ అమలు..

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. స్టేడియం చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు.

దాదాపు 700 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత విధుల్లో సాయుధ బలగాలతోపాటు పారా మిలిటరీ బలగాలు పాల్గొన్నాయి.

జూబ్లీహిల్స్​ ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ ఏర్పాటు చేశారు.

కేంద్రం వద్ద 144 సెక్షన్​ అమలు చేస్తున్నారు. స్టేడియానికి వంద మీటర్ల దూరంలో ఎవరూ గుమిగూడకుండా చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Must Read
Related News