అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills Elections) గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ (Congress) బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ.. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార షెడ్యూల్‌ను పార్టీ తాజాగా ఖరారు చేసింది.
Jubilee Hills | వరుస రోడ్ షోలు
జూబ్లీహిల్స్‌లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు కేటీఆర్ (KTR) విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అక్టోబర్ 31న షేక్‌పేట్, నవంబర్ 1న రహమత్ నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షోలో పాల్గొంటారు. నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు.
Jubilee Hills | హోరాహోరీగా పోరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక్కడ బీజేపీ (BJP) పోటీ చేస్తున్నా.. ప్రచారంలో వెనకబడింది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అనేక యత్నాలు చేస్తోంది. కేసీఆర్ సైతం ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నాలుగు రోజుల పాటు ప్రచారం చేపట్టనున్నారు. రోడ్ షోలు, బైక్ ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు.

