5
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి (Chennur MLA Gaddam Vivek Venkataswamy) రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం లభించడంతో మాల సంఘం (Mala Sangham) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నస్రుల్లాబాద్ (Nasrullabad) మండల కేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.
వివేక్ వెంకట స్వామి తెలంగాణ ఉద్యమం (Telangana udyamam) సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర వహించారన్నారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు బాల సాయిలు, నర్సింలు, కొక్కెర సాయిలు, సంగయ్య, నెమలి శంకర్, పండరి, బాలయ్య, గోపి, పోచయ్య, రాములు, కిష్టయ్య, మొగులయ్య, నర్సింలు పాల్గొన్నారు.