అక్షరటుడే, ఇందూరు: ‘సాక్షి’ పత్రిక ప్రధాన సంపాదకుడు ధనుంజయ రెడ్డిపై (Dhanunjaya Reddy, Editor-in-Chief of Sakshi Magazine) నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ (Nizamabad Collectorate) ఎదుట నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్‌కు (Nizamabad Additional Collector Ankit Kumar) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలన్నారు. వెంటనే అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని, జర్నలిస్టులపై ప్రభుత్వాల ఆజమాయిషీ నిరంకుశత్వమన్నారు. అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టి, పత్రికా ఎడిటర్‌పై అనుమతి లేకుండా సోదాలు నిర్వహించి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బిలి నర్సయ్య (IJU State Executive Member Bobbili Narsayya), ప్రమోద్ గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకుడు జమాల్పూర్ గణేష్(Telangana Journalists Forum State Leader Jamalpur Ganesh), ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మోహన్, ‘సాక్షి’ బ్యూరో ఇన్‌ఛార్జి భద్రారెడ్డి, ఎడిషన్ ఇన్‌ఛార్జి ప్రభాకర్, జిల్లా జర్నలిస్టులు సంఘాల నాయకులు శ్రీనివాస్, ఉమామహేశ్వర్, ఆంజనేయులు, ‘సాక్షి’ జిల్లా, మండల విలేకరులు పాల్గొన్నారు.
Journalists protesting | జర్నలిస్టుల నిరసన
7
previous post