106
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట్ (Jogipet) వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ‘ప్రజాగళం’ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న దేవా సక్సేనా బాన్సువాడ మండలం దేశాయిపేటలో నివాసముంటున్నారు.
హైదరాబాద్ నుంచి మంగళవారం బాన్సువాడకు (Hyderabad to Banswada) బైక్పై వస్తున్న సమయంలో జోగిపేట్ వద్ద బైక్ అదుపుతప్పగా దేవా సక్సైనా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన అకాల మరణంతో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దేవా సక్సేనా మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.