Banswada | కాంగ్రెస్ పార్టీలో భాస్కర్ రెడ్డి సమక్షంలో చేరికలు

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ కార్యాలయంలో (Banswada constituency office) శనివారం వర్ని మండలం కూనిపూర్​కు చెందిన పలువురు సీనియర్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో బీజేపీకి చెందిన వర్ని మండల (Varni Mandal) ప్రముఖ నాయకులు శివ, నవీన్ రెడ్డి, సతీశ్​, దత్తు, మహేందర్ రెడ్డి, బాలు, ప్రవీణ్ గౌడ్, […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ కార్యాలయంలో (Banswada constituency office) శనివారం వర్ని మండలం కూనిపూర్​కు చెందిన పలువురు సీనియర్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.

కార్యక్రమంలో బీజేపీకి చెందిన వర్ని మండల (Varni Mandal) ప్రముఖ నాయకులు శివ, నవీన్ రెడ్డి, సతీశ్​, దత్తు, మహేందర్ రెడ్డి, బాలు, ప్రవీణ్ గౌడ్, శేఖర్, గోవుర్ నరేశ్​ తదితరులు పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొత్త నాయకుల రాక శక్తినిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ అభ్యర్థి గిరి సాయిలు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...