అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రెండేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న అవినీతిని చూసిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని టీజీఎస్ ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో (Hanmajipet Village) కాంగ్రెస్కు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ (Former MLA Baji Reddy Govardhan) మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. కొత్తగా చేరిన వారందరికీ పార్టీ ద్వారా తగిన గౌరవం, బాధ్యతలు కల్పిస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వడ్ల కృష్ణమూర్తి, వడ్ల స్వరూప, నాగులూరి భాగ్య, నాగులూరి సంజీవులు, వడ్ల భాస్కర్, వడ్ల సంగయ్య, సింగం సాయిలు, కలవరాల నారాయణ, సింగం విఠల్, రాజు మాడ సాయిలు, శంకర్, మంద సాయిలు తదితరులున్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Banswada | బీఆర్ఎస్లో పలువురి చేరిక
బాన్సువాడ మండలం హన్మాజీపేట్కు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
