అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RBI Jobs | పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నవారికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టు (Office Attendant Posts)ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చర్యలు చేపట్టింది. 572 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టు పేరు : ఆఫీస్ అటెండెంట్.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 572.
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు :
ప్రారంభ వేతనం నెలకు బేసిక్ పే, అలవెన్సులు కలిపి రూ.46,029 వరకు లభిస్తుంది.
దరఖాస్తు రుసుము : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 450(జీఎస్టీ అదనం) దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మిగతావారు రూ. 50(జీఎస్టీ అదనం) చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 04.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష తేదీలు : ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు ఉండే అవకాశాలున్నాయి.