అక్షరటుడే, ఇందూరు : Jobs | కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ తెలిపారు. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ జిల్లాకు ఈడీసీ మేనేజర్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన కేటాయించిందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.nimsme.gov.in వెబ్సైట్ లేదా 9640909831 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
