అక్షరటుడే, వెబ్డెస్క్: Postal Jobs | భారతీయ తపాలా (Indian Postal Service) శాఖ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతోంది. 28,740 పోస్టుల వరకు భర్తీ చేయడం కోసం ఈనెల 31న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాలలో 1,734 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. భర్తీ చేసే పోస్టులు, అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు :
28,740(అంచనా). ఇందులో తెలంగాణ (Telangana)లో 519 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 1,215 పోస్టులున్నాయి.
భర్తీ చేసే పోస్టుల వివరాలు : గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం) .
వేతనం వివరాలు..
బీపీఎం : రూ. 12 వేల నుంచి రూ. 29,380 వరకు..
ఏబీపీఎం/జీడీఎస్ : రూ. 10 వేల నుంచిి రూ. 24,470 వరకు..
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
దరఖాస్తు రుసుము..
జనరల్/ఓబీసీ అభ్యర్థులు వంద రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 31.
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 14.
మెరిట్ లిస్ట్ విడుదల : ఫిబ్రవరి 28. (అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు)