అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Govt Jobs | కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయి (Mumbai)లోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్)లో కాంట్రాక్ట్ బేసిస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈనెల 25 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 147. (ఆరఎఫ్ అండ్ ఎండబ్ల్యూ, ఎలక్ట్రానిక్స్, సీఎస్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ హెచ్‌వీఏసీ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, మెడికల్, ఫిట్టర్ తదితర విభాగాలలో అవకాశాలుంటాయి)
పోస్టుల వారీగా వివరాలు..
ప్రాజెక్ట్ ఇంజినీర్ – 71
ప్రాజెక్ట్ అసోసియేట్ – 05
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ – 34
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్(ఏ మరియు బీ) – 37.
విద్యార్హత : పోస్ట్‌ను అనుసరించి ఐటీఐ, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (బీ) పోస్టులకు మాత్రం మూడేళ్లపైన పని అనుభవం అవసరం.
వయోపరిమితి : ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (ఏ) పోస్టులకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (బీ) పోస్టులకు 30 ఏళ్లు మించరాదు.
వేతనం వివరాలు :
ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ. 34 వేలు.
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 23,500.
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (ఏ) కు రూ. 21 వేలు.
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (బీ) కు రూ. 23,500.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : జనవరి 25.
ఎంపిక విధానం : పోస్టును అనుసరించి రాతపరీక్షతోపాటు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://recruitment.sameer.gov.in లో సంప్రదించండి.