
అక్షరటుడే, వెబ్‌డెస్క్: northern Burkina Faso : ఉత్తర బుర్కినా ఫాసోలో ఓ జిహాదీ ముఠా jihadist group మారణహోమం సృష్టించింది. దేశంలోని పలు చోట్ల ఒకేసారి జరిపిన దాడుల్లో 100 మందికి పైగా అసువులు బాసారు. మరణించినవారిలో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు.
‘ప్రధానంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జిహాదీ ముఠా దాడులు చేసింది. కీలక పట్టణమైన జిబోతో సహా అనేక ప్రదేశాల్లో ఆదివారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేపట్టింది’ అని ఓ సహాయక కార్యకర్త (ఎయిడ్ వర్కర్) తెలిపినట్లు స్థానిక మీడియా కథనం ప్రచురించింది.
సహెల్ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం) amaat Nasr al-Islam wal-Muslimin (JNIM) అనే జిహాదీ ముఠా ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది. దీనికి అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సైనిక జుంటా పరిపాలన
బుర్కినా ఫాసోలో సైనిక జుంటా పరిపాలన ఉంది. ఈ దేశంలో 23 మిలియన్ల జనాభా నివసిస్తోంది. ఈ భూపరివేష్టిత దేశం హింసాత్మక తీవ్రవాదానికి ప్రపంచ హాట్ స్పాట్‌గా మారింది. ఈ క్రమంలో ఆఫ్రికా Africa లోని సహెల్ ప్రాంతం Sahel region లో అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల్లో ఈ కంట్రీ ఒకటిగా నిలిచింది.
ఉగ్రవాదులదే హవా
2022లో జిహాదీలు హింసాత్మక తిరుగుబాట్లు చేపట్టారు. దీంతో బుర్కినా ఫాసోలోని దాదాపు సగభాగం ప్రభుత్వ నియంత్రణలో చేజారిపోయింది. మరోవైపు దేశ భద్రతా దళాలు సైతం చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు.
‘బుర్కినా ఫాసోలోని వైమానిక దళాన్ని లక్ష్యంగా చేసుకుని జేఎన్ఐఎం తీవ్రవాదులు JNIM terrorists ఒకేసారి 8 ప్రాంతాలపై దాడులు చేపట్టారు. ప్రధాన దాడి జిబోలో చోటుచేసుకుంది. ఈ పట్టణంలోని అన్ని ప్రవేశ తనిఖీ కేంద్రాలను తీవ్రవాదులు తమ అధీనంలోకి తీసేసుకున్నారు. తర్వాత సైనిక శిబిరాలపై, మరీ ముఖ్యంగా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ క్యాంపుపై దాడులు చేశారు’ అని ఓ ఎయిడ్ వర్కర్ వివరించారు.
తాజా దాడితో బుర్కినా ఫాసోలో ఈ జిహాదీ ముఠా ప్రాబల్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని సౌఫాన్ సెంటర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్, సీనియర్ రీసెర్చ్ ఫెలో వాసిమ్ నాస్ర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు సామాన్య పౌరులను భారీగా మిలటరీలోకి తీసుకుంటున్నారని, కానీ వారికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్ల పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.