Homeజిల్లాలునిజామాబాద్​Armoor | ‘జీవన్​రెడ్డి అక్రమాలు ఆర్మూర్​ ప్రజలకు తెలుసు..’

Armoor | ‘జీవన్​రెడ్డి అక్రమాలు ఆర్మూర్​ ప్రజలకు తెలుసు..’

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అక్రమాలు, రౌడీయిజం నియోజవర్గ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ ఆర్మూర్ బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అక్రమాలు, రౌడీయిజం నియోజవర్గ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ (Congress Party BC Cell President Dondi Ramana) అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవన్​రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో (Armoor constituency) చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) లేదన్నారు. మార్నింగ్ వాక్ పేరుతో పిచ్చిపిచ్చిగా మాట్లాడారన్నారు. పట్టణంలోని డివైడర్ల మధ్య నాటిన మొక్కలు ఎంతో ప్రమాదమో తెలిసి కూడా ఆనాడు బీఆర్​ఎస్​ నాయకులు డబ్బులకు కక్కుర్తి పడి నాటించారన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెట్లను తొలగించడం జరిగిందన్నారు. జనతా గ్యారేజ్​ను ప్రజల మంచి కోసం వాడాలన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే జీవన్​ రెడ్డిని ఆర్మూర్​లో తిరగనివ్వబోమని స్పష్టం చేశారు.

Must Read
Related News