అక్షరటుడే, ఆర్మూర్: Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) గోపీనాథ్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఆకీమ్షా కాలనీ, మినీ బృందావన్ కాలనీలో బీఆర్ఎస్ (BRS Party) అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరారు. అలాగే రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తోంద వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంచి పెట్టారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
