అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండల శివారు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లతో పాటు జేసీబీని (JCB)సీజ్ చేసినట్లు ఎస్సై శివకుమార్ (SI Shiva Kumar)తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. జేసీబీతో పాటు రెండు మొరం ట్రాక్టర్లతో పాటు మరో ఆరు ఖాళీ ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
