అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jatadhara | టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జటాధర’. ఈ మూవీ త్వరితగతిన రూపుదిద్దుకుంటోంది. డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ (Director Venkat Kalyan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.ఈ చిత్రంలో శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులే కాక ఇతర భాషలకు సంబంధించిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Jatadhara | టీజర్ వచ్చేస్తోంది..
తాజాగా చిత్రబృందం అందించిన అప్డేట్ ప్రకారం, ‘జటాధర’ మూవీ టీజర్‌ను (Jatadhara Movie Teaser) ఆగస్టు 8న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. టీజర్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు (Sudheer Babu) లుక్ బలమైన శౌర్యాన్ని ప్రతిబింబించగా, టీజర్‌పై అంచనాలు మరో మెట్టు ఎక్కాయి. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేపగా, టీజర్ విడుదలతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత పుంజుకుంటాయి.
సుధీర్ బాబు గత సినిమాల కంటే కాస్త డిఫరెంట్‌గా ‘జటాధర’ చిత్రం ఉండనుంది. ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. బలమైన కథ, పవర్‌ఫుల్ స్టార్ కాస్ట్, గ్రాండ్ టెక్నికల్ టీమ్ ఉండడంతో సినిమా భారీ విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విభిన్న కథా చిత్రాలతో సుధీర్ బాబు అలరిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రేమకథా చిత్రమ్, హరోంహర వంటి చిత్రాల్లో తనలోని మాస్ కోణాన్ని చూపించి అదరగొట్టాడు. వీటన్నింటికీ డిఫరెంట్‌గా మైథలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో జటాధరతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు.