Artificial Blood | స‌రికొత్త టెక్నాల‌జీ కనిపెట్టిన జ‌పాన్.. వైద్యానికి ర‌క్తంతో పని లేదు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Artificial Blood | ప్రస్తుత వైద్య రంగంలో అత్యవసర చికిత్సల కోసం రక్తం(Blood) ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శస్త్రచికిత్సలు, ప్రమాదాలు, రక్తహీనత, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ప్రాణాలను నిలబెట్ట‌డం జ‌రుగుతుంటుంది. కానీ, అందుబాటులో ఉన్న రక్తం పరిమితకాలం మాత్రమే నిల్వ ఉండడం అనే షరతులు, శీతలీకరణ అవసరం వంటి ఎన్నో పరిమితులు వైద్య రంగాన్ని ఆపదలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా జపాన్ శాస్త్రవేత్తలు(Japanese scientists) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Artificial Blood | ప్రస్తుత వైద్య రంగంలో అత్యవసర చికిత్సల కోసం రక్తం(Blood) ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శస్త్రచికిత్సలు, ప్రమాదాలు, రక్తహీనత, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ప్రాణాలను నిలబెట్ట‌డం జ‌రుగుతుంటుంది. కానీ, అందుబాటులో ఉన్న రక్తం పరిమితకాలం మాత్రమే నిల్వ ఉండడం అనే షరతులు, శీతలీకరణ అవసరం వంటి ఎన్నో పరిమితులు వైద్య రంగాన్ని ఆపదలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా జపాన్ శాస్త్రవేత్తలు(Japanese scientists) అభివృద్ధి చేసిన ‘కృత్రిమ రక్తం’ (Artificial Blood) ఇప్పుడు కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదు, ఎంతో మంది ప్రాణాల‌ను కూడా నిల‌బెడుతుంది.

Artificial Blood | సక్సెస్ అవుతుందా?

గత కొన్నేళ్లుగా జ‌పాన్ Japan దేశ శాస్త్రవేత్తల కృత్త్రిమ రక్తం తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్నో పరిశోధనలు, పరీక్షల అనంతరం కృత్రిమ రక్తం తయారీ అనేది తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్(Clinical trials) కూడా నిర్వహించారట. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది. ఇది గనక సక్సెస్ అయితే వైద్యచరిత్రలోనే ఇదొక అద్భుతం అనే చెప్పాలి. రక్తం కొరతతో చనిపోతున్న ఎంతోమందిని కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ కృత్రిమ రక్తం మాములు మనిషి రక్తంలా కాకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు కృత్రిమ రక్తం నిల్వ ఉంటుందట. సహజ రక్తం కేవలం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. సహజ రక్తం మాదిరిగా రక్త వర్గాలు ఉండవు. ఈ కృత్రిమ రక్తం ఏ గ్రూప్ వారికైనా వినియోగించవచ్చు. నిజంగా ఇది అద్భుతమని చెప్పాలి.

జపాన్‌లోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ రక్తం ‘హీమోగ్లోబిన్ వెసికిల్స్ (HbVs)’ అనే నానో టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. రక్తదానం చేసినవారి నుండి హీమోగ్లోబిన్‌ను తీసుకుంటారు. దాన్ని సింథటిక్ లిపిడ్ పొరలతో కప్పిన చిన్న బుడగలుగా(నానో వెసికిల్స్) మార్చుతారు. ఇవి నిజమైన ఎర్ర రక్త కణాల(RBCs) లాగా పని చేస్తూ ఆక్సిజన్‌ను శరీరంలో పంపుతాయి. కొన్ని వెర్షన్లలో ప్లేట్‌లెట్లకు ప్రత్యామ్నాయమైన చర్యలు కూడా ఉండేలా అభివృద్ధి చేశారు. ఇది రక్తం గడ్డకట్టడం వంటి కీలక ప్రక్రియలో సహాయపడుతుంది. ప్రారంభంగా జంతువులపై, ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు చేశారు. 100 మిల్లీలీటర్ల వరకు ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించినప్పటికీ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ప్రస్తుతం 2025లో విస్తృత మానవ ప్రయోగం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అనుకూలంగా వస్తే, 2030 నాటికి ఇది మార్కెట్లోకి రానుంది. అలా ఈ అద్భుతాన్ని క్రియేట్ చేసిన మొట్టమొదటి దేశంగా జపాన్ ఆవిర్భవిస్తుంది. ఇక అగ్రరాజ్యం అమెరికా America కూడా కృత్రిమ రక్తం తయారీపై ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. కానీ, ఈ విషయంలో జపాన్ ముందు ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...