అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 23 Pre Market Analysis | గ్రీన్ ల్యాండ్ విషయంలో యూరోపియన్ దేశాలపై సుంకాల విధింపు నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US president Trump) వెనక్కి తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా సాగుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌తోపాటు యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం నెగెటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 23 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.87 శాతం, ఎసఅండ్‌పీ 0.55 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.16 శాతం లాభంతో ఉంది.
Jan 23 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 1.19 శాతం, సీఏసీ 0.98 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.12 శాతం పెరిగాయి.
Jan 23 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 7.50 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.88 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.57 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.48 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.39 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.29 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.16 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.09 శాతం నష్టంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా పన్నెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,549 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు రూ. 4,222 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.78 నుంచి 0.87కు పెరిగింది.
- విక్స్(VIX) 3.12 శాతం తగ్గి 13.35 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 91.62 వద్ద నిలిచింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.49 డాలర్ల వద్ద ఉంది.