అక్షరటుడే, హైదరాబాద్: Jan 23 Gold Prices | గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలకు Silver Prices గురువారం గట్టి బ్రేక్ పడింది. ఐరోపా దేశాలపై విధించనున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి తగ్గి, సేఫ్ హేవన్‌గా భావించే బంగారం, వెండిపై డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది.
ఫలితంగా భారత్‌లో పసిడి ధరలు సుమారు రూ.2200 వరకు, వెండి ధరలు దాదాపు రూ.5000 వరకు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారం జనవరి 23 ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300గా నమోదవగా, 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,41,440కు దిగివచ్చింది.
Jan 23 Gold Prices | ప్రధాన నగరాల్లో ఇలా…
విజయవాడ, విశాఖపట్నం Vishakapatnam నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. దేశంలో చెన్నైలో మాత్రం అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,900గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,39,900గా కొనసాగుతుండగా, చెన్నై, విజయవాడలో కూడా ఇదే రేటు ఉంది. ముంబైలో మాత్రం కిలో వెండి అత్యల్పంగా రూ.3,24,900 పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. చెన్నైలో 24 క్యారెట్ రూ.1,54,900, 22 క్యారెట్ రూ.1,41,990గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ రూ.1,54,300, 22 క్యారెట్ రూ.1,41,440గా కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ రూ.1,54,450, 22 క్యారెట్ రూ.1,41,590గా ఉండగా, వడోదరా, అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ రూ.1,54,350, 22 క్యారెట్ రూ.1,41,490గా నమోదయ్యాయి.
వెండి ధరల విషయానికి వస్తే చెన్నై.. హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి రూ.3,39,900గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో రూ.3,24,900గా ఉంది.
ఐరోపా దేశాలపై సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గడంతో పాటు గ్రీన్‌లాండ్‌ను Green Land బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని స్పష్టం చేయడంతో గ్లోబల్ మార్కెట్లలో ఉద్రిక్తత తగ్గిందని, దీంతో బంగారం, వెండిపై డిమాండ్ తగ్గడంతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.