అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 22 Pre Market Analysis | గ్రీన్ ల్యాండ్‌పై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు(Geo political tension) తగ్గుతుండటంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈయూపై సుంకాలు విధించే ఆలోచనపై ట్రంప్ వెనక్కి తగ్గడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) ర్యాలీ తీసింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ భారీ లాభాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాపఅప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 22 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.17 శాతం, ఎసఅండ్‌పీ 1.116 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.34 శాతం లాభంతో ఉంది.
Jan 22 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.58 శాతం నష్టంతో ముగియగా.. ఎఫ్‌టీఎసఈ 0.11 శాతం, సీఏసీ 0.08 శాతం పెరిగాయి.
Jan 22 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 7.50 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.99 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.97 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.74 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.46 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.09 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.71 శాతం లాభంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫఐఐలు వరుసగా పన్నెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,787 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు రూ. 4,520 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.72 నుంచి 0.78కి పెరిగింది.
- విక్స్ 8.25 శాతం పెరిగి 13.78 కు చేరింది. గతేడాది జూన్ 23 తర్వాత ఇదే గరిష్టం.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 72 పైసలు బలహీనపడి 91.70 వద్ద నిలిచింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.32 డాలర్ల వద్ద ఉంది.
- భారత్, ఈయూల మధ్య భద్రత, రక్షణ భాగస్వామ్యంపై ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి.
- గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ కుదిరిందని, దీంతో ఫిబ్రవరి 1 నుంచి ఈయూపై అదనపు సుంకాలను విధించబోమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్తతలు తగ్గాయి.
- భారత్, యూఎస్ వాణిజ్య ఒప్పందం విషయంలోనూ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య మంచి ఒప్పందం రాబోతోందని ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోంది.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.