అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 22 horoscope | గ్రహచలనాలు ఈ రోజు (గురువారం, జనవరి 22) మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. చాలా రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవడం శ్రేయస్కరం. కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా అభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయి.
మేష రాశి: Jan 22 horoscope | అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు గానీ, కొత్త పనులు గానీ మొదలుపెట్టకండి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది . ఆత్మీయులు, పాత స్నేహితులు కలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఒక సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. వారు చేసే ఒక మంచి పని ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వృషభ రాశి: Jan 22 horoscope | వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఆశిస్తున్న ప్రశంసలు, రివార్డులు దక్కకపోవచ్చు. దీనివల్ల కొంచెం నిరాశ కలిగినా ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలను మీ ముందుకు తెస్తారు.
మిథున రాశి: Jan 22 horoscope | పెట్టుబడులు, వ్యాపార అంచనాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండండి. పనిలో మీదే పైచేయి ఉంటుంది. మీలో ఉత్సాహం కొంచెం తక్కువగా ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: Jan 22 horoscope | ప్రేమ విషయంలో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చు. తల్లిదండ్రులను మెప్పించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఆఫీసులో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. పనులను సమయానికి పూర్తి చేయండి.
సింహ రాశి: ఆరోగ్య విషయంలో ఒక స్నేహితుని సలహా, సూచన బాగా ఉపయోగపడుతుంది. తెలిసిన వ్యక్తుల ద్వారా కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. భాగస్వామి నుంచి ఒక అందమైన సర్ప్రైజ్, కానుక అందవచ్చు. జీవితంలో బాగా స్థిరపడిన పెద్దల సలహాలు తీసుకోండి. భవిష్యత్తు ప్రణాళికల గురించి వారితో చర్చించడం మేలు చేస్తుంది.
కన్యా రాశి: బ్యాంకు పనులు, నగదు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది, మీరు ఆశించిన ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా పడుతున్న కష్టానికి ఇవాళ తగిన ఫలితం లభిస్తుంది.
తులా రాశి: సన్నిహితంగా ఉండేవారు, భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. వారు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఎవరికీ చెప్పకండి. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.
వృశ్చిక రాశి: చుట్టుపక్కల వారు మిమ్మల్ని గమనిస్తూ, మిమ్మల్ని ఒక రోల్ మోడల్‌గా భావిస్తుంటారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టాలని, బాధపెట్టాలని చూడవచ్చు. కానీ మీరు కోపానికి గురికాకుండా శాంతంగా ఉండండి. అనవసరమైన ఆందోళనలు, టెన్షన్లు పడకండి.
ధనుస్సు రాశి: మీ దగ్గర ఉన్న డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టండి. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. మీకు అవసరమైనప్పుడు స్నేహితులు అండగా నిలుస్తారు. వృత్తిపరమైన విషయాల్లో ఒక స్నేహితుని సహాయం బాగా కలిసి వస్తుంది.
మకర రాశి: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగవచ్చు. మనసులోని వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. జీవితంలో బాగా స్థిరపడిన వ్యక్తులతో సమయం గడపండి. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో వారి సూచనలు ఎంతో మేలు చేస్తాయి.
కుంభ రాశి: ఇవాళ మీ ముందుకు అనేక పెట్టుబడి పథకాలు వస్తాయి. కానీ ఎక్కడైనా డబ్బు పెట్టేముందు, మాట ఇచ్చేముందు లాభనష్టాలను బాగా ఆలోచించుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల ఒత్తిడికి తలొగ్గకండి. సొంత ఆలోచనతోనే ముందుకు సాగండి.
మీన రాశి: అందరి దృష్టిని ఆకర్షించడానికి, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో, పనిలో వస్తున్న మార్పులు మీకు మేలు చేస్తాయి. పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇది మంచి సమయం. ఇవాళ చేసే విహార యాత్రలు, చిన్నపాటి ప్రయాణాలు పూర్తి సంతృప్తిని ఇస్తాయి.