అక్షరటుడే, హైదరాబాద్: Jan 22 Gold Prices | అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు Silver Prices రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సోమవారం నుంచి వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ముఖ్యంగా బుధవారం ఒక్కసారిగా రూ.6 వేల వరకు పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే గురువారం నిన్నటితో పోలిస్తే స్వల్పంగా ధరలు తగ్గడంతో కొద్దిగా ఊరట లభించింది. అయినప్పటికీ బంగారంతో పాటు వెండి ధర కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది.
Jan 22 Gold Prices | నేడు ఇలా..
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,610 వద్ద కొనసాగుతుండగా, నిన్న ఈ ధర రూ.1,56,600గా ఉంది. అదే నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,43,560గా ఉండగా, నిన్న రూ.1,43,550 వద్ద స్థిరపడింది.
- విజయవాడ, విశాఖపట్నం Vishakapatnam మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.1,56,610 వద్ద ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,560గా కొనసాగుతోంది.
- చెన్నైలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,57,270గా ఉండగా, నిన్న ఇది రూ.1,57,260గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,160గా కొనసాగుతుండగా, బుధవారం ఇది రూ.1,44,150 వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,610గా ఉండగా, బుధవారం రూ.1,56,600గా నమోదైంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,560గా ఉండగా, నిన్న రూ.1,43,550 వద్ద స్థిరపడింది.
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,760గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,710గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే మరింత దూకుడుగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,30,100గా ఉండగా, బుధవారం ఇది రూ.3,30,000 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,45,100గా కొనసాగుతుండగా, నిన్న రూ.3,45,000గా నమోదైంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,45,100గా ఉండగా, బెంగళూరులో రూ.3,30,100 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.