అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 21 Market Analysis | గ్రీన్ ల్యాండ్(Greenland) విషయంలో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందనలతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లు(Global markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో యూఎస్‌తోపాటు యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. యూఎస్ ఫ్యూచర్స్ మాత్రం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 2.41 శాతం, ఎసఅండ్‌పీ 2.08 శాతం నష్టపోయాయి. అక్టోబర్ 10 తర్వాత ఒకరోజులో ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.28 శాతం లాభంతో ఉంది.
Jan 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 1.04 శాతం, ఎఫ్‌టీఎసఈ 0.68 శాతం, సీఏసీ 0.61 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ఉదయం 7.50 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై 0.34 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.19 శాతం లాభాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.62 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.53 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.45 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.39 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05 శాతం లాభంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గ·మనించాల్సిన అంశాలు..
- ఎఫఐఐ(FII)లు వరుసగా పదకొండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,938 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.77 నుంచి 0.72 కు తగ్గింది.
- విక్స్ 7.63 శాతం పెరిగి 12.73 కు చేరింది. విక్స్ పెరుగుతుండడం బేర్స్ ఆధిపత్యానికి సూచన.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 90.97 వద్ద నిలిచింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.18 డాలర్ల వద్ద ఉంది.
- భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 27న జరిగే భారత్, ఈయూ శిఖరాగ్ర సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.