అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 20 Market Analysis | గ్రీన్ ల్యాండ్(Greenland)ను వదులుకోవడానికి ఇష్టపడని యూరోపియన్ యూనియన్.. యూఎస్‌కు కౌంటర్ ఇచ్చే చర్యలకు సన్నద్ధమవుతోంది. ట్రేడ్ బజూకా(Trade bazooka)ను అమలు చేసే అవకాశం ఉండడంతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
గత సెషన్‌లో యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. యూఎస్ ఫ్యూచర్స్ సైతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నెగెటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Jan 20 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే సందర్భంగా సోమవారం యూఎస్ ఈక్విటీ మార్కెట్లు మూసి ఉన్నాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.74 శాతం నష్టంతో ఉంది.
Jan 20 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 1.81 శాతం, డీఏఎక్స్(DAX) 1.35 శాతం, ఎఫ్‌టీఎసఈ 0.39 శాతం నష్టపోయాయి.
Jan 20 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 7.50 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1.16 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.59 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.58 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.56 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.39 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.20 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.10 శాతం లాభంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
గ·మనించాల్సిన అంశాలు..
- ఎఫఐఐలు వరుసగా పదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,269 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 98వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 4,234 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.76 నుంచి 0.77 కు పెరిగింది.
- విక్స్(VIX) 4 శాతం పెరిగి 11.83 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 90.91 వద్ద నిలిచింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.01 డాలర్ల వద్ద ఉంది.
నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.