Jan 19 market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 19 market Analysis | యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Trump) బెదిరింపులు కొనసాగుతున్నాయి. గ్రీన్ లాండ్ విషయంలో తన మాట వినని దేశాలపై కొత్త సుంకాల(Tariffs)ను విధిస్తామన్న హెచ్చరికలతో గత సెషన్‌లో యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దాని ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపిస్తోంది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం చైనా, సౌత్ కొరియా మినహా మిగిలిన అన్ని ప్రధాన ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 19 market Analysis | యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Trump) బెదిరింపులు కొనసాగుతున్నాయి. గ్రీన్ లాండ్ విషయంలో తన మాట వినని దేశాలపై కొత్త సుంకాల(Tariffs)ను విధిస్తామన్న హెచ్చరికలతో గత సెషన్‌లో యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దాని ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపిస్తోంది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం చైనా, సౌత్ కొరియా మినహా మిగిలిన అన్ని ప్రధాన ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) సైతం నష్టాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Jan 19 market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో ఎసఅండ్‌పీ 0.06 శాతం నష్టపోగా.. నాస్‌డాక్(Nasdaq) ఫ్లాట్‌గా ముగిసింది. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.60 శాతం నష్టంతో ఉంది.

Jan 19 market Analysis | యూరోప్ మార్కెట్లు..

సీఏసీ 0.66 శాతం, డీఏఎక్స్(DAX) 0.22 శాతం, ఎఫ్‌టీఎసఈ 0.04 శాతం నష్టపోయాయి.

Jan 19 market Analysis | ఆసియా మార్కెట్లు..

ఉదయం 8 గంటల ప్రాంతంలో షాంఘై మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.97 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.26 శాతం లాభంతో, జపాన్‌కు చెందిన నిక్కీ 0.96 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.69 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.01 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.58 శాతం నష్టంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ·మనించాల్సిన అంశాలు..

  • ఎఫఐఐలు వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,346 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 97వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 3,935 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.81 నుంచి 0.76 కు తగ్గింది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు బలహీనపడి 90.86 వద్ద నిలిచింది.
  • యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.23 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.19 వద్ద కొనసాగుతున్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.15 డాలర్ల వద్ద ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...