అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 18 Horoscope | గ్రహాల అనుకూలత కారణంగా చాలా రాశుల వారికి ఈ రోజు (ఆదివారం, జనవరి 18) ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో భాగస్వాముల సహకారంతో లాభాలు గడిస్తారు. మరికొన్ని రాశుల వారికి కుటుంబం కోసం కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అద్భుతమైన రోజుగా కనిపిస్తోంది. కొన్ని రాశుల వారు ప్రయాణాల్లో ఉన్నప్పుడు తమ వస్తువుల పట్ల, వాహనాలు నడిపేటప్పుడు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద అన్ని రాశుల వారికి ఈరోజు సానుకూల ఫలితాలు అందుతాయి.
మేష రాశి: Jan 18 Horoscope | వ్యాపారస్తులకు ఇవాళ కలిసొస్తుంది. కుటుంబం కోసం ఏదైనా కొత్త పని, ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి రోజు. అందరి సహకారంతో విజయం సాధిస్తారు.
వృషభ రాశి: Jan 18 Horoscope | ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం చేసేటప్పుడు వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్న చిన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. పాత స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది.
మిథున రాశి: Jan 18 Horoscope | వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరం, సమాచారం ద్వారా అందే ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మనసులోని కొన్ని విషయాలు ఆందోళనకు గురిచేయవచ్చు. అలాంటి సమయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి సమస్యను పంచుకోవడం మంచిది.
కర్కాటక రాశి: Jan 18 Horoscope | చాలా కాలంగా వేధిస్తున్న ఒత్తిడి నుంచి ఇవాళ ఉపశమనం లభిస్తుంది. ఇంటి పనుల కోసం, ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం, దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. స్నేహితులు అండగా ఉంటారు. ఇవాళ భాగస్వామితో చిన్నపాటి గొడవలు, అపార్థాల వల్ల పరిస్థితులు తమ చేతిలో లేనట్లు అనిపించవచ్చు.
సింహ రాశి: డబ్బుకు సంబంధించిన విషయాల్లో, ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇతరులను ఆకట్టుకునే స్వభావం వల్ల మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడటానికి, ఆదాయం పెరగడానికి.. రోజూ సూర్యోదయ సమయంలో 11 సార్లు ‘ఓం’ కారాన్ని జపించాలి.
కన్యా రాశి: అందరి దృష్టిని ఆకర్షించడానికి, గుర్తింపు పొందడానికి ఇది సరైన రోజు. మీరు అనుకున్న పనులన్నీ ఒక క్రమపద్ధతిలో పూర్తి చేస్తారు. పాత పరిచయస్తులు, గతంలో విడిపోయిన వారు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. సమస్యల పరిష్కారం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.
తులా రాశి: తమలోని హాస్యచతురత ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. అందరితో సాధారణ విషయాలు మాట్లాడటం మంచిదే, కానీ వ్యక్తిగత రహస్యాలను మాత్రం పంచుకోవద్దు. ఇప్పటి వరకు ఆలోచించకుండా ఖర్చు చేసిన వారికి, ఇవాళ డబ్బు విలువ అర్థమవుతుంది.
వృశ్చిక రాశి: ఇవాళ ఆశించిన స్థాయిలో ధనలాభం ఉండకపోవచ్చు. ఖర్చుల విషయంలో కాస్త పొదుపు పాటించడం మంచిది. స్నేహితులు అండగా నిలుస్తారు. దొరికిన ఖాళీ సమయంలో సమస్యలకు పరిష్కారాలను వెతుక్కుంటారు. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.
ధనుస్సు రాశి: ఇవాళ ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉండవచ్చు. పేరున్న వ్యాపారవేత్తలు కూడా ఇవాళ కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తమ పట్ల అసూయ, చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల వల్ల ఇబ్బంది కలగవచ్చు.
మకర రాశి: తమ ఆకర్షణీయమైన ప్రవర్తన ఇవాళ అందరినీ ఆకట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్ (భూములు, ఇళ్లు) రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. దీనివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. పేరును, గౌరవాన్ని పాడు చేయాలని చూసే వ్యక్తులకు దూరంగా ఉండాలి.
కుంభ రాశి: ఇవాళ కొంచెం అసౌకర్యంగా, అశాంతిగా అనిపించవచ్చు. అయితే, మీ స్నేహితుడు ఒకరు మీ సమస్యలను పరిష్కరించడంలో తోడుగా నిలుస్తారు. పనిలో, వ్యాపారంలో నిర్లక్ష్యం వహించకండి. అజాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇతరులను మెప్పించే స్వభావం వల్ల మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
మీన రాశి: చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసేవారికి, సన్నిహితుల ఇచ్చే సలహాలు ఇవాళ మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పాత స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు.