అక్షరటుడే, హైదరాబాద్: Jan 18 Gold Prices | దేశవ్యాప్తంగా ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు Gold Rates సామాన్య వినియోగదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు ఏకంగా రూ.3 వేలకుపైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. అయితే, ఆదివారం మాత్రం బంగారం ధరలు మార్పులేకుండా స్థిరంగా కొనసాగడం కొంత ఊరటను కలిగిస్తోంది.
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువల్లో మార్పులు వంటి కారణాలతో బంగారం ధరలు ఇటీవల వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ధరలు స్థిరంగా ఉండటంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Jan 18 Gold Prices | ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే…
- హైదరాబాద్‌లో Hyderabad 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,780 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,800 వద్ద నిలిచింది.
- విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,780గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,800 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,870గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,800 వద్ద స్థిరపడింది. శనివారం ఉన్న రేట్లే ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,780గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,800 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వెండి ధరలు ఇప్పటికే మూడు లక్షల మార్క్‌కు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3,10,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర నమోదవుతోంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,10,000గా ఉండగా, ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది.