అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 17 Horoscope | గ్రహ గతుల ప్రకారం నేడు (శనివారం, జనవరి 17) కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభం, మరికొందరికి చాలా కాలంగా వసూలు కాని బాకీలు తిరిగి చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆరోగ్యం విషయంలో స్వల్ప జాగ్రత్తలు పాటిస్తూ, ఆర్థికపరమైన నిర్ణయాల్లో తెలివైన ఆలోచనలు చేస్తే ఇవాళ తిరుగుండదు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో ఈ రోజంతా ఎలా సాగిపోతుందో.. భవిష్యత్తుపై నక్షత్రాల ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి: Jan 17 Horoscope | డబ్బు సంపాదించే విషయంలో చాలా తెలివైన ఆలోచనలు చేస్తారు. వ్యాపారం, ఆర్థిక ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ప్రేమించే వారితో ఉన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోతాయి. ఇవాళ శారీరకంగా, మానసికగా ఉత్సాహంగా ఉంటారు.
వృషభ రాశి: Jan 17 Horoscope | జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి: Jan 17 Horoscope | ఊహించని ధనలాభం కలుగుతుంది. గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే, ఆ డబ్బులు ఇవాళ తిరిగి ఇచ్చేస్తారు. సొంత నిర్ణయాల కంటే ఇతరుల సలహాల ప్రకారం నడుచుకోవడం మంచిది. ప్రేమ విషయంలో అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి: Jan 17 Horoscope | మీ మాటతీరు, వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. చుట్టూ ఉన్నవారు మీ పట్ల సానుకూలంగా ఉంటారు. డబ్బు పరంగా ఇవాళ కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు, బంధుత్వాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. గతానికి సంబంధించిన ఏదైనా పాత విషయం బయటపడటం వల్ల జీవిత భాగస్వామి కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి: గత కొన్ని రోజులుగా జరిగిన విషయాల వల్ల మనసు కొంచెం చికాకుగా ఉండవచ్చు. ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం మంచిది. కోర్టు వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా మారుతాయి. దీనివల్ల ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది.
కన్యా రాశి: చుట్టూ ఉన్నవారు మీ నుంచి చాలా సహాయం ఆశిస్తారు. ఇవాళ అదృష్టం కలిసి వస్తుంది. ఎవరో తెలియని వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
తులా రాశి: ప్రస్తుతం మీరు ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడుతున్నారు. భయాన్ని వదిలేసి, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. చాలా కాలంగా రాకుండా ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఊరట లభిస్తుంది.
వృశ్చిక రాశి: వ్యాపారం చేసే వారికి వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ధనలాభం కలుగుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులు, తెలిసిన వారు ఒకరు అతిగా ప్రవర్తించి, ఇంట్లో చికాకులు పుట్టించవచ్చు. జీవిత భాగస్వామి ఇవాళ ఒక సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: మీకు ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి సహాయం లేకుండానే స్వశక్తితో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సంతోషం కలిగించే పనుల మీద దృష్టి పెట్టండి. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.
మకర రాశి: మీ ఆకర్షణీయమైన ప్రవర్తన వల్ల కొత్త స్నేహితులు పరిచయమవుతారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కలుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయడం, కొన్ని కఠిన నిర్ణయాల వైపు నడిపించే అవకాశం ఉంది. ఇవాళ మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ ‘లక్ష్మీ చాలీసా’ పఠించండి.
కుంభ రాశి: చిన్నపాటి ఆరోగ్య సమస్య వల్ల మీరు అనుకున్న ముఖ్యమైన పని ఆగిపోవచ్చు. ఎవరైనా పెద్ద పథకాలు చెప్పి మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కానీ, ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ వ్యక్తి ఎంతవరకు నమ్మదగ్గవారో బాగా విచారించి నిర్ణయం తీసుకోండి.
మీన రాశి: పాత ఆరోగ్య సమస్యలు ఇవాళ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. దీనివల్ల హాస్పిటల్ ఖర్చులు ఉండొచ్చు. ఎప్పుడూ డబ్బు, కుటుంబ సమస్యల గురించే కాకుండా, కొంచెం ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించండి. అది మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది.