అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 15 Horoscope | ఈ సంక్రాంతి పండుగ వేళ గ్రహ గతులు నేడు (గురువారం, జనవరి 15) పలు రాశుల వారికి భిన్న ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో భావోద్వేగాల కంటే తెలివితేటలకి, ఆర్థిక క్రమశిక్షణకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను నిర్వహించుకోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పండుగ పూట చేసే చిన్న సాయం మీ స్థితిని మెరుగుపరిచే అవకాశం ఉంది.
మేష రాశి: Jan 15 Horoscope | అనుకోని ఖర్చులు పెరగడం వల్ల కాస్త ఆందోళనగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు భాగస్వాముల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది, కానీ భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో అండగా నిలుస్తారు. ఇవాళ ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదు, కాబట్టి వీలైతే వాయిదా వేసుకోండి.
వృషభ రాశి: Jan 15 Horoscope | వ్యాపారంలో లాభాలు గడించడానికి పాత స్నేహితుడు ఇచ్చే సలహా బాగా పని చేస్తుంది. వ్యాపార భాగస్వాములు అండగా ఉంటారు. వారితో కలిసి పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మిథున రాశి: Jan 15 Horoscope | ధనాన్ని భద్రమైన చోట పొదుపు చేయండి. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తుంది. ఆఫీసులో కొన్ని ఇబ్బందులు తొలగిపోయి, ఒక మంచి సర్ప్రైజ్ ఎదురవుతుంది. మీ ఆలోచనలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిని స్నేహితులు పరిచయం చేస్తారు.
కర్కాటక రాశి: Jan 15 Horoscope | స్టాక్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. ఇవాళ నగలు, ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త విషయాలు, టెక్నాలజీ నేర్చుకోవడానికి చిన్న చిన్న కోర్సుల్లో చేరండి. పాత సమస్యలు చర్చకు రావడం వల్ల వాదనలు జరిగే అవకాశం ఉంది.
సింహ రాశి: అనవసర ఖర్చుల వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో రిపేర్లు, శుభకార్యాల వల్ల రోజంతా బిజీగా గడుపుతారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉండండి. అనాలోచితంగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కన్యా రాశి: భూమి, ఆస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం, దీనివల్ల భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పాల్గొనే వేడుకలు, పార్టీలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మేలు జరుగుతుంది.
తులా రాశి: తెలియని వ్యక్తులు ఇచ్చే సలహాల వల్ల పెట్టుబడులలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకున్న ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, తెలివితేటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. సినిమా, రంగస్థలం, ఇతర కళా రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను చాటుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి: కొన్ని అభిప్రాయభేదాల వల్ల ఇవాళ టెన్షన్లు, చిరాకు కలగవచ్చు. ఇంట్లో జరిగే కొన్ని మార్పులు మిమ్మల్ని ఎమోషనల్‌గా మారుస్తాయి. మీ లక్ష్యాల గురించి పది మందికి చెప్పకండి. విజయం సాధించే వరకు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి.
ధనుస్సు రాశి: కొత్త పథకాల్లో డబ్బు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులకు ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. అకస్మాత్తుగా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సోషల్ ఫంక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంది.
మకర రాశి: చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్యం నుంచి ఇవాళ విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది. పర్యావరణానికి సంబంధించిన రంగాలలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. సమాజంలో హోదా ఉన్న వ్యక్తులతో కలిస్తే, భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్లు వేసుకోవడం సులభం అవుతుంది.
కుంభ రాశి: సామాజిక కార్యక్రమాలలో, యువతతో కలిసి చేసే పనుల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయం. మీరు ఆశించిన ప్రశంసలు, రివార్డులు అందకపోవచ్చు. కాస్త ఓపిక పట్టండి. ఇవాళ ఏర్పడే కొత్త సంబంధాలు, బంధుత్వాలు దీర్ఘకాలంలో చాలా మేలు చేస్తాయి.
మీన రాశి: ఆఫీసులో, పనిలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇవాళ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం మనసు చెప్పింది కాకుండా, మేధస్సును ఉపయోగించి ఆలోచించండి. డబ్బు విషయంలో జీవిత భాగస్వామితో గొడవ వచ్చే అవకాశం ఉంది.