అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 14 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్ నెగెటివ్‌గా ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అయ్యాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగా స్పందిస్తున్నాయి. జపాన్ నిక్కీ(Nikkei) మాత్రం పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో రికార్డు స్థాయి గరిష్టాలకు చేరి తొలిసారి 54 వేల మార్క్‌ను దాటింది. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 14 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
యూఎస్ ప్రెసిడెంట్(US President) డొనాల్డ్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ విషయంలో ఈరోజు అక్కడి సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. దీనికితోడు ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీకి బ్రేక్ పడిరది. గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.23 శాతం, నాస్‌డాక్(Nasdaq) 0.15 శాతం తగ్గగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.10 శాతం నష్టంతో ఉంది.
Jan 14 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.06 శాతం లాభపడగా.. సీఏసీ 0.14 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.16 శాతం నష్టపోయాయి.
Jan 14 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో షాంఘై మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1.74 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.93 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.73 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.51 శాతం లాభంతో, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.28 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.23 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05 శాతం నష్టంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,499 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 96వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.90 నుంచి 0.86 కు తగ్గింది.
- విక్స్(VIX) గత సెషన్‌లో 1.50 శాతం తగ్గి 11.20 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 90.19 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.18 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.20 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.43 డాలర్లకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ఆయిల్ దిగుమతులపై ఆధారపడిన మనలాంటి దేశాలకు ప్రతికూలం.
- యూఎస్‌లో ద్రవ్యోల్బణం పెరిగింది. గతనెలలో వినియోగదారుల ధర సూచికలో 0.3 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిసెంబర్ వరకు 12 నెలల్లో సీపీఐ 2.7 శాతం పెరిగింది.
- యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నిరసనలు కొనసాగించాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
- భారత్, యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఫోన్ సంభాషణలు సకారాత్మకంగా సాగాయని మన విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ఆశలు చిగురిస్తున్నాయి.