అక్షరటుడే, హైదరాబాద్: Jan 14 Gold Prices | వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం, వెండిపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు (Gold prices).
Jan 14 Gold Prices | రూపాయి పతనం..
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండటం కూడా బంగారం, వెండి ధరలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 14న ఉదయం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,42,690గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,810కి చేరింది.
అదే సమయంలో విజయవాడ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,540గా , 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,660గా కొనసాగుతోంది. వడోదరలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,590గా , 22 క్యారెట్ల బంగారం ధర gold rate రూ.1,30,710గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా కిలోకు సుమారు రూ.100 మేర పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,92,100గా ఉండగా, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,75,100గా నమోదైంది.
బంగారం, వెండి ధరల్లో silver prices కొనసాగుతున్న ఈ పెరుగుదలతో మార్కెట్‌పై పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.