అక్షరటుడే, హైదరాబాద్: Jan 13 Gold Prices | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడుదుడుకులు, డాలర్‌తో Dollar పోల్చితే రూపాయి బలహీనత వంటి అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరిగి కొత్త గరిష్టాలకు చేరాయి.
సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుండటంతో పసిడి, వెండిపై డిమాండ్ మరింత పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 13 ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,42,160కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,30,310గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,310కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,460గా ఉంది.
Jan 13 Gold Prices | క్రమంగా పెరుగుదల..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- విజయవాడ: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- ఢిల్లీ Delhi: 24 క్యారెట్ – రూ. 1,42,310 | 22 క్యారెట్ – రూ. 1,30,460
- ముంబై: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- వడోదర: 24 క్యారెట్ – రూ. 1,42,210 | 22 క్యారెట్ – రూ. 1,30,360
- కోల్‌కతా: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- చెన్నై: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- బెంగళూరు: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- కేరళ: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310
- పుణే: 24 క్యారెట్ – రూ. 1,42,160 | 22 క్యారెట్ – రూ. 1,30,310గా ట్రేడ్ అయింది.
బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2.7 లక్షలు నుంచి రూ. 2.87 లక్షల మధ్య నమోదైంది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) ఎంత ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్: రూ. 2,87,100
- విజయవాడ: రూ. 2,87,100
- ఢిల్లీ: రూ. 2,70,100
- చెన్నై: రూ. 2,87,100
- కోల్‌కతా: రూ. 2,70,100
- కేరళ: రూ. 2,87,100
- ముంబై: రూ. 2,70,100
- బెంగళూరు: రూ. 2,70,100
- వడోదర: రూ. 2,70,100
- అహ్మదాబాద్: రూ. 2,70,100
అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగడం, కేంద్ర బ్యాంకుల విధానాలపై అనిశ్చితి, అలాగే రూపాయి పతనం వంటి అంశాలు బంగారం–వెండి ధరలను Silver Prices ముందుకు నడిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే సమీప కాలంలో కూడా ధరలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.