అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 13 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా సాగుతున్నాయి. యూఎస్, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఇది మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమవుతాయన్న సంకేతాన్ని ఇస్తోంది.
Jan 13 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
టెక్, కన్జూమర్ స్టేపుల్ స్టాక్స్‌లో ర్యాలీతో వాల్‌స్ట్రీట్ రికార్డు స్థాయి గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి. గత సెషన్లో నాస్డాక్ (Nasdaq) 0.27 శాతం, ఎస్అండ్పీ 0.16 శాతం పెరగ్గా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
Jan 13 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.57 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.16 శాతం లాభపడ్డాయి. సీఏసీ 0.04 శాతం నష్టపోయింది.
Jan 13 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో షాంఘై మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ (Nikkei) 3.26 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.46 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.72 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.40 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.40 శాతం లాభంతో, చైనాకు చెందిన షాంఘై 0.19 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.23 శాతం లాభంతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా ఆరో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,638 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 95వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 5,839 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో (PCR) 0.62 నుంచి 0.90 కు పెరిగింది.
- విక్స్ (VIX) గత సెషన్లో 4.05 శాతం పెరిగి 11.37 కు చేరింది. వొలటాలిటీ ఇండెక్స్ వారం రోజుల్లోనే 15.6 శాతం పెరగడం గమనార్హం.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 90.16 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.19 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.97 వద్ద కొనసాగుతున్నాయి.
- యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మరో కొత్త సుంకాల పాట అందుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. దీంతో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.02 డాలర్లకు చేరింది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.