అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Trap | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలోని జగద్గిరిగుట్ట ఎస్సై (Jagadgirigutta SI) ఏసీబీకి పట్టుబడ్డారు. డీజే సిస్టమ్‌ను (DJ system) తిరిగి ఇచ్చేందుకు ఆయన లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు (ACB officials).. జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ సహాయంతో రూ.15వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిద్దరిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
