HomeUncategorizedsocial media influencers ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆట కట్టు.. చర్యలకు ఐటీ స్టాండింగ్...

social media influencers ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆట కట్టు.. చర్యలకు ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశం

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: social media influencers : మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారిన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న సామాజిక మాధ్యమ ఛానెళ్లను నిషేధించడంతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

social media influencers : సోషల్ మీడియాలో దుష్ప్రచారం..

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గావ్​లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదివరకే భారత్‌కు వ్యతిరేకంగా దేశ మీడియా డిబేట్స్ లో పాకిస్తానీయులు పాల్గొనకండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా దేశంలోని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా సంస్థ ప్రతినిధులు తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గుర్తించింది. ఆ కంటెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పోస్టులు హింసను ప్రేరేపించే అవకాశం ఉందని భావిస్తోంది.

social media influencers : ఆ సోషల్ ఖాతాలపై కేంద్రం నిషేధం

ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఐటీ చట్టం 2000, ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021’ ప్రకారం దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న ఛానళ్లు, ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని ప్రతిపాదనలు పంపించాయి.

కేంద్ర మంత్రిత్వశాఖలు పక్కా సమాచారంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలతో పాటు సోషల్ మీడియా ఖాతాలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం స్టాండింగ్ కమిటీకి కావలసిన సమాచారాన్ని మే 8, 2025 లోగా మనలో ఎవరైనా పంపవచ్చు. దాని సాఫ్ట్ కాపీని comit@sansad.nic.in కు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది.

social media influencers : మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్

భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రక్షణ కోసం మే 7, 2025న దేశ వ్యాప్తంగా సమర్థవంతంగా మాక్ డ్రిల్‌ నిర్వహించాలంది. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ లో ప్రత్యక్షంగా వివరిస్తారు. ఇందులో అధికారులతోపాటు ప్రజలు, వివిధ సంస్థలు, వ్యవస్థలు పాల్గొననున్నాయి.

Must Read
Related News