అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IT Raids | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి ఐటీ అధికారుల సోదాల కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు నిర్వహించారు.నగరంలోని వుడ్ బ్రిడ్జ్ హోటల్ (Woodbridge Hotel) యజమాని ఇంట్లో సోదాలు చేపట్టారు.
హోటల్ ఓనర్ అలీఖాన్‌ను విచారించారు. నగరంలోని పలు హోటళ్ల యజమానుల ఇళ్లపై ఇటీవల అధికారులు సోదాలు నిర్వహించారు. పిస్తాహౌజ్, షా గౌస్, మైహ్పిల్ హోటళ్ల యమాజనులు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఆయా హోటళ్ల నిర్వాహకులు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి నగరంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానికి షాగౌస్, పిస్తాహౌస్ హోటళ్లతో (Pistachio House Hotels) సంబంధాలపై ఆరా తీశారు.
IT Raids | వ్యాపారుల్లో కలవరం
హైదరాబాద్ నగరంలో ఇటీవల ఐటీ అధికారుల తనిఖీలు పెరగడంతో వ్యాపారులు కలవర పడుతున్నారు. గతంలో బంగారం దుకాణాల్లో (Gold Shops) ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డ పలువురికి నోటీసులు ఇచ్చారు. అనంతరం ఇటీవల మూడు హోటళ్ల యాజమానులపై సోదాలు చేపట్టి నగదు, బంగారం సీజ్ చేశారు. తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమపై ఇన్‌కం ట్యాక్స్ రైడ్ అవుతుందోనని భయ పడుతున్నారు.
