అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | బీజేపీతోనే అంబేడ్కర్ ఆశయ సాధన సాధ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి (Ambedkar Statue) శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. అలాంటి గొప్ప నాయకుడు అంబేడ్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం బీజేపీతో (BJP) మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, ఆకుల శ్రీనివాస్, రంగన్న, దొండి ప్రకాష్, శ్రీనివాస్, ఉదయ్ గౌడ్, రాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
