Israeli PM calls Modi | మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ఫోన్.. ఇరాన్‌ మీద దాడిపై వివరణ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Israeli PM calls Modi : ఇజ్రాయిల్‌(Israel), ఇరాన్‌(Iran) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి ఫోన్‌ చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమాలు, ఆ దేశంపై దాడికి దారి తీసిన కారణాలను ఆయన మోదీకి వివరించారు. నెతన్యాహు ఫోన్‌ చేసిన విషయాన్ని ప్రధాని ధ్రువీకరించారు. “ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Israeli PM calls Modi : ఇజ్రాయిల్‌(Israel), ఇరాన్‌(Iran) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి ఫోన్‌ చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమాలు, ఆ దేశంపై దాడికి దారి తీసిన కారణాలను ఆయన మోదీకి వివరించారు. నెతన్యాహు ఫోన్‌ చేసిన విషయాన్ని ప్రధాని ధ్రువీకరించారు.

“ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిణామాలు, పరిస్థితుల గురించి ఆయన నాకు వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై భారత్‌ ఆందోళనను వ్యక్తపర్చాను. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాను” అని మోదీ ‘X’లో పేర్కొన్నారు.

Israeli PM calls Modi : ఇరాన్‌పై భీకర దాడులు

ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్‌ భీకర దాడులకు దిగింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, క్షిపణి వ్యవస్థలు, సైనిక కమాండ్ కీలకమైన విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్”ను ప్రారంభించింది.

200 ఫైటర్‌ జెట్లు ఇరాన్‌పై మూకుమ్మడి దాడి చేయగా, జనరల్ అమీర్ అలీ హజీజాదే, మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరి, మేజర్ జనరల్ హోస్సేన్ సలామి, మేజర్ జనరల్ ఘోలం అలీ రషీద్‌లతో సహా అనేక మంది సీనియర్ సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇరాన్ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసితో సహా ఆరుగురు అణు శాస్త్రవేత్తలు కూడా ఇజ్రాయెల్ దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయారు.

మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి(Mohammad Mehdi Tehranchi) (సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త theoretical physicist, షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయం మాజీ డైరెక్టర్ former rector of Shahid Beheshti University), ఇతర అణు శాస్త్రవేత్తలు(nuclear scientists) అబ్దుల్‌హమిద్ మినౌచెహర్(Abdolhamid Minouchehr), అహ్మద్రెజా జోల్ఫాఘారి(Ahmadreza Zolfaghari), సయ్యద్ అమిర్‌హోస్సేన్ ఫఖీ(Seyyed Amirhossein Faki), మోట్లాబిజాదే(Motlabizadeh) కూడా ఈ దాడుల్లో మరణించారు.

ఇజ్రాయెల్ దాడులను ఖండించిన ఇరాన్.. తమ ప్రతిస్పందనకు పరిమితులు లేవని పేర్కొంది. “ఇప్పుడు అల్-కుద్స్ జెరూసలేంను ఆక్రమించిన ఉగ్రవాద పాలన అన్ని రేఖలను దాటింది. ఈ నేరానికి ప్రతిస్పందించడంలో ఎటువంటి పరిమితులు లేవు” అని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei ఇజ్రాయెల్ “కఠినమైన శిక్ష” ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...