Homeఅంతర్జాతీయంIsraeli attack | గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు..

Israeli attack | గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు..

పాలస్తీనా, ఇజ్రాయిల్​ మధ్య మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజాపై ఇజ్రాయిల్​ దళాలు విరుచుకుపడ్డాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Israeli attack | పాలస్తీనా, ఇజ్రాయిల్​ (Israel) మధ్య మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజాపై ఇజ్రాయిల్​ దళాలు విరుచుకుపడ్డాయి. ఐడీఎఫ్​ చేసిన దాడుల్లో 20 మందికిపైగా మరణించినట్లు గాజాడిఫెన్స్​ ఏజెన్సీ (Gaza Defense Agency) తెలిపింది.

గాజా నగరం, ఖాన్ యూనిస్ ప్రాంతాలపై బుధవారం అర్ధరాత్రి సమయంలో (భారత కాలమానం ప్రకారం) ఇజ్రాయిల్ దాడికి దిగింది. రక్షణ దళాలు నిర్వహించిన తాజా దాడుల్లో 20 మందికి ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అల్ జజీరా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ దాడులు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏర్పడిన యుద్ధవిరామ ఒప్పందం ఉన్నప్పటికీ, పెరుగుతున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

Israeli attack | లెబనాన్‌లోని శరణార్థి శిబిరంపై దాడి

గాజాపై దాడికి ముందు రోజు మంగళవారం దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా (Palestine) శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేసింది. ఈ దాడిలో 10మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మంగళవారం దాడి జరిగినట్లు అల్​ జజీరా కథనం. అయితే ఈ దాడులు సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

Israeli attack | కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత

హమాస్​ – ఇజ్రాయిల్​ (Hamas and Israel) మధ్య అక్టోబర్​ 10 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడిగా తెలుస్తోంది.