US ISKCON temple | అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ప‌రిగణించిన భార‌త్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US ISKCON temple : అమెరికాలోని America ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో బంగ్లాదేశ్‌ Bangladesh లో ఇస్కాన్ ఆలయంపై దాడులు జరగడం, చిన్మయ్ కృష్ణదాస్‌ (Chinmay Krishnadas) ను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు హిందూ సమాజాన్ని కలిచివేశాయి. ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం ఉద్రేకానికి దారి తీసింది. అమెరికాలోని ఉతాహ్ Utah రాష్ట్రం, స్పానిష్ ఫోర్క్Spanish Fork ప్రాంతంలో ఉన్న శ్రీశ్రీ రాధా […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US ISKCON temple : అమెరికాలోని America ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో బంగ్లాదేశ్‌ Bangladesh లో ఇస్కాన్ ఆలయంపై దాడులు జరగడం, చిన్మయ్ కృష్ణదాస్‌ (Chinmay Krishnadas) ను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు హిందూ సమాజాన్ని కలిచివేశాయి.

ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం ఉద్రేకానికి దారి తీసింది. అమెరికాలోని ఉతాహ్ Utah రాష్ట్రం, స్పానిష్ ఫోర్క్Spanish Fork ప్రాంతంలో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ దేవాలయంపై కొందరు దుండగులు రాత్రివేళ కాల్పులు జరిపారు. భక్తులతో పాటు అతిథులు ఆలయంలోనే ఉన్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

US ISKCON temple : భార‌త్ సీరియ‌స్..

ఈ ఘటనలో గోడలపైకి, కిటికీలపైకి 20-30 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆలయ నిర్మాణానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. గత నెలలో ఇప్పటికే మూడు సార్లు ఇలాంటి దాడులు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన ప్రకటించింది.

శాన్ ఫ్రాన్సిస్కో San Francisco లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక అధికారిక ప్రకటన చేస్తూ.. ఇస్కాన్ Iscon ఆలయంపై జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భక్తులు, ఆలయ నిర్వాహకులకు మద్దతుగా ఉంటాం.. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరుతున్నాం.. అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ లో ఓ పోస్ట్ చేశారు.

హోలీ వేడుకల Holi celebrations సమయంలో కూడా విద్వేషపూరిత దాడి జ‌రిగింది. ఈ ఇస్కాన్ ఆలయం హోలీ Holi వేడుకలకు ప్రసిద్ధి. ఆలయంలో ఏడాది పొడ‌వున‌ పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు.

ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ Vai Warden మాట్లాడుతూ..“గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలయం శాంతియుతంగా కొనసాగుతోంది. కానీ, ఇటీవల మూడుసార్లు ఇలాగే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వాగత ద్వారాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆలయం 1990లో నిర్మించబడింది. అప్పటి నుంచి ఇది స్థానిక హిందూ సంఘానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇస్కాన్ ఆలయంపై జరుగుతున్న దాడుల సంఘటనలు కేవలం సంప్రదాయాలపైనే కాదు, విద్వేషానికి ప్రతీకగా మారుతున్నాయి.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...