Pakistan Army Chief | ప‌రారీలో పాక్ ఆర్మీ చీఫ్‌?
Pakistan Army Chief | ప‌రారీలో పాక్ ఆర్మీ చీఫ్‌?

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pakistan Army Chief | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ సయ్యద్ అసిమ్ మునీర్ (Syed Asim Munir) ఆ దేశం విడిచి పారిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్న భార‌త్‌పై క‌వ్వింపుల‌కు పాల్ప‌డిన అత‌డు ప్రాణ‌భ‌యంతో ప్ర‌స్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లు చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన క్రూరమైన ఉగ్ర దాడిలో అమాయక 27 మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌(Pakistan)కు బుద్ధి చెప్ప‌డంతో ప‌హ‌ల్గామ్ బాధితుల‌కు న్యాయం చేయాలని భారత్ (India) ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ దేశం విడిచి పారిపోయారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Pakistan Army Chief | బంక‌ర్‌లోనా .. విదేశాల్లోనా?

ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి(Terror Attack)కి రెండు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్(Pakistan Army Chief).. కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లేని పాకిస్తాన్‌ను ఊహించుకోలేమ‌న్నారు. అలాగే, హిందు, ముస్లింల‌ది భిన్న వైఖ‌రి అని, ప్ర‌తి అంశంలోనూ విభిన్నంగా ఉన్నార‌ని తెలిపారు. ఆయ‌న మాట్లాడిన త‌ర్వాతి రెండ్రోజుల‌కే ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర దాడి జ‌రిగింది.

దీంతో పాకిస్తాన్‌పై ముప్పేట దాడికి భార‌త్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే ఆ దేశంతో అన్ని ర‌కాల సంబంధాలు తెంచుకోవ‌డంతో పాటు కీల‌క‌మైన సింధు జ‌లాల(Sindhu River) ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. దీంతో ప్ర‌తీకార చ‌ర్య‌ల పేరుతో పాక్ కూడా అన్ని సంబంధాలు తెంచుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ (Pakistan Army Chief Munir) కూడా తాము త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. భార‌త్ యుద్ధ స‌న్నాహాలు చేసుకుంటోంద‌ని తెలిసి ఆయ‌న కుటుంబాన్ని విదేశాల‌కుపంపించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయ‌న జాడ కూడా లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు, జనరల్ మునీర్ ప్రాణ‌భ‌యంతో రావల్పిండిలోని ఒక బంకర్‌లో దాక్కున్నారని మీడియా సంస్థ‌లు(Media organizations) పేర్కొన్నాయి.

Pakistan Army Chief | పాక్ విఫ‌ల ప్ర‌య‌త్నాలు..

ఆర్మీ చీఫ్ పారిపోయార‌న్న ప్ర‌చారాన్ని ఖండించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం(Pakistan Government) విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పాకిస్తాన్ పీఎంవో అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఫొటో పోస్టు చేసింది. అబోటాబాద్ నుంచి ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Prime Minister Shehbaz Sharif), జనరల్ మునీర్ ముందు వరుసలో కూర్చున్నట్లు ఆ ఫొటోలో ఉంది.