అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి అభివృద్ధిని మరిచి ప్రొటోకాల్ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఫిర్యాదులు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
Shabbir Ali | ఎమ్మెల్యేకు పట్టింపే లేదు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy) అభివృద్ధిపై తాను ముందుకు వెళ్తుంటే ఎమ్మెల్యేకు పట్టింపు లేదన్నారు. అభివృద్ధి జరుగుతున్న చోట 14 గ్రామాలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఇక్కడ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్‌ను (KCR) ఓడించారని, ప్రస్తుత సీఎంను మూడోస్థానంలో ఉంచి అధికారంలో లేని వ్యక్తిని గెలిపించారన్నారు. ఇక్కడ తాము గెలవకున్నా అభివృద్ధి ఆగుతుందా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నప్పటికీ శిలాఫలకం వేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
Shabbir Ali | అధికారులకు సమయమివ్వని ఎమ్మెల్యే..
అధికారులు ఎమ్మెల్యే కోసం వెళ్తే సమయం ఇవ్వడని, మహారాష్ట్ర, ఢిల్లీ (Maharashtra and Delhi) వెళ్తున్నానని చెబుతున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసి కామారెడ్డిలో అభివృద్ధికి కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల్లో సగం అయినా ఇవ్వాలని కోరానని తెలిపారు. దాంతో కొడంగల్‌తో సమానంగా నిధులు ఇస్తానని తెలిపారన్నారు. తనకు నిజామాబాద్ ఇన్‌ఛార్జి పదవి ఉన్నా కామారెడ్డి ప్రాంతం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని కోరారు.