అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Telangana | సిరిసిల్లకు చెందిన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (irrigation executive engineer) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలంలో (rajanna sircilla district, venkatapur mandal) నిర్మించిన చెక్‌డ్యామ్ బిల్లుల (check dam bill) మంజూరు కోసం ఈఈ అమరేందర్ రెడ్డి (EE Arram Reddy Amarender Reddy) లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని (ACB siricilla) ఆశ్రయించాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఈఈ తన నివాసంలో రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB officials) పట్టుకున్నారు. కాగా.. ఏసీబీ అధికారుల రాకను ముందే గమనించిన సదరు అధికారి ఆ డబ్బును బయట విసిరేశాడు. అయితే అధికారులు డబ్బును స్వాధీనం చేసుకొని నిందితుడు అమరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.