HomeUncategorizedIranian Foreign Minister Abbas Araghchi | ఢిల్లీకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్...

Iranian Foreign Minister Abbas Araghchi | ఢిల్లీకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి.. ఎందుకోసమంటే..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Iranian Foreign Minister Seyyed Abbas Araghchi : ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం రాత్రి న్యూఢిల్లీ New Delhi కి చేరుకున్నారు. ఆగస్టు 2024లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా భారతదేశానికి వచ్చారు.

హైదరాబాద్ హౌస్‌ Hyderabad House లో గురువారం మధ్యాహ్నం భారత్​ ఇరాన్ మధ్య జరిగే 20వ జాయింట్ కమిషన్ సమావేశాని Joint Commission meeting కి విదేశాంగ మంత్రి External Affairs Minister (EAM) S. జైశంకర్‌ Jaishankar తో కలిసి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి భవన్‌ ashtrapati Bhavan లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము President Draupadi Murmu ను ఇరాన్ విదేశాంగ మంత్రి కలుస్తారు.

భారత్​ – ఇరాన్ స్నేహ ఒప్పందం India-Iran Treaty of Friendship పై సంతకం చేసిన 75వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న జాయింట్ కమిషన్ సమావేశంలో పరస్పర ఆసక్తికర అంశాలను సమీక్షించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పలు అంశాలు ప్రతిపాదిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.

ఏటా జాయింట్ కమిషన్ సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ, కొవిడ్-19 Covid-19 మహమ్మారి, ఇరు దేశాలలో దేశీయ ఆందోళనల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో నిర్వహించలేదు.

“ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక ఒప్పందాల economic agreements అమలు, తాజా పరిస్థితిని కమిషన్ సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకుంటారు” అని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘X’ వేదికగా ప్రకటించింది.

పహల్గామ్​ ఉగ్రవాద దాడి Pahalgaon terror attack ని అరాఘ్చి సైతం తీవ్రంగా ఖండించారు. “పహల్గామ్​ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. భారత ప్రజలకు, ప్రభుత్వానికి మా సంతాపం” అని ఆయన ‘X’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

Must Read
Related News