Iran – Israel | ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్‌ దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran – Israel | ఇరాన్​ – ఇజ్రాయెల్ (Iran – Israel)​ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్​లోని అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో తీవ్ర అలజడి నెలకొంది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్​– ఇరాన్​ దాడులు చేసుకుంటుండగా శనివారం రాత్రి అమెరికా (America) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్​పై ఆదివారం ఉదయం డ్రోన్లు, క్షిపణులను […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran – Israel | ఇరాన్​ – ఇజ్రాయెల్ (Iran – Israel)​ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్​లోని అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో తీవ్ర అలజడి నెలకొంది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్​– ఇరాన్​ దాడులు చేసుకుంటుండగా శనివారం రాత్రి అమెరికా (America) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్​పై ఆదివారం ఉదయం డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

ఇరాన్​పై అమెరికా దాడులతో ముందుగానే ఇజ్రాయెల్​ అప్రమత్తమైంది. తమ భూభాగంపై టెహ్రాన్ (Tehran)​ దాడులకు దిగుతుందని భావించి హై అలర్ట్​ ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. సభలు, సమావేశాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) నిషేధించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్​ ఊహించినట్లుగానే ఇరాన్​ ప్రతిదాడులకు దిగింది. భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో టెల్​ అవీవ్​పై విరుచుకుపడింది. రెండు ఇరాన్‌ డ్రోన్లు ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. దాడులతో టెల్‌ అవీవ్‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు తలదాచుకుంటున్నారు.

కాగా.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్​లోని పలు అణుస్థావరాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇరాన్​లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో ఉన్న ఫోర్డో అణు శుద్ధి కేంద్రాన్ని తాము పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump)​ ప్రకటించారు. దానిపై ఆరు బంకర్​ బస్టర్​ బాంబులను ప్రయోగించామని తెలిపారు. భూగర్భంలోకి చొచ్చుకుని వెళ్లి విధ్వంసం సృష్టించడం బంకర్​ బస్టర్​ బాంబుల ప్రత్యేకత. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్​ ఇజ్రాయెల్​పై ప్రతిదాడులకు దిగింది. అయితే అమెరికాపై ఎలా స్పందిస్తుందనే విషయం చూడాలి.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...